జలపాతంలో బంగారు చేప రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు

జలపాతంలో బంగారు చేప రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ఈ జలపాతంలో అమ్మవారు బంగారు చేప రూపంలో దర్శనమిస్తారని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం పోల్లూరు టైగ్రిస్ జలపాతం వద్ద మన్యంకొండ జాతర ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది భక్తులు ఈ జాతరకు తరలి వచ్చారు. గత 20 రోజుల క్రితం ఒడిస్సా రాష్ట్రంలోని మల్కన్ గిరిలో మొదలైన ఈ జాతర ఈరోజు కొల్లూరు జలపాతానికి చేరుకుంది.


గత 20 రోజుల నుంచి భక్తులు అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తూ గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహిస్తూ 80 కిలోమీటర్ల మేర కాలినడకన నడుచుకుంటూ ఈరోజు చింతూరు మండలం పోల్లూరు జలపాతానికి చేరుకున్నారు. ఈ జలపాతంలో అమ్మవారు బంగారు చేప రూపంలో దర్శనమిస్తారని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారు నదిలో స్నానమాచరించిన తర్వాత అదే నదిలో భక్తులు స్నానం చేస్తే అమ్మవారి దీవెనలు అందుతాయని వారి నమ్మకం. ఒడిశా నుంచి అమ్మవారిని ఇక్కడ వరకు తీసుకు వచ్చి ఈ జలపాతంలో స్నానం చేయించిన అనంతరం భక్తులు అమ్మవారిని తీసుకొని ఊరేగింపుగా ఒడిశాలోని మల్కన్‌గిరి చేరుకుంటారు.

Tags

Next Story