MAO: ప్రశ్నార్థకమవుతున్న మావోల ఉనికి.. నేడు భారత్ బంద్

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, బీకే-ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పొలీసులకు లొంగిపోయారు. ఆయనతో సహా మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు వీరి లొంగుబాటులో ఇవాళ హైదరాబాద్‌లో డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ తెలిపారు. లొంగుబాటు సందర్భంగా తమ వద్ద ఉన్న ఉన్న ఆయుధాలను మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. మావోయిస్టుల వద్ద నుంచి 303 రైఫిల్స్, జీ3 రైఫల్స్, ఎస్ఎల్ఆర్లు, ఏకే 47 లు రైఫిల్స్, భారీగా బెల్లుట్లు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు నగదుతో పాటు మరికొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా ఏవోబీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నిర్మాణంలో ఆజాద్ కీలక పాత్ర పోషించారు. లొంగిపోయిన ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు చెప్పారు.
అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు వీరంతా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారంతా తమ ఆయుధాలను కూడా అప్పగించినట్లు తెలిపారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారు. వీళ్లంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నాం’’ అని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారు. వీళ్లంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నాం’’ అని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారు.
నేడు భారత్ బంద్
అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ నవంబర్ 23న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఎన్కౌంటర్లు బూటకమంటూ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక మావోయిస్టు పార్టీ భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

