పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హతమార్చిన మావోలు

పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హతమార్చిన మావోలు

విశాఖ ఏజెన్సీలో మరోసారి అలజడి మొదలైంది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు హత్యచేశారు. దీంతో ఏఒబిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిన్న పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. దీంతో రెచ్చిపోయిన మావోలు.. పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో ఓ గిరిజనుడిని హతమార్చారు. జి మాడుగుల మండలం నుర్మతి పంచాయితీ, వాకపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని ఆదివారం రాత్రి చంపేశారు. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ పేరుతో లేఖను వదిలి వెళ్లారు. కృష్ణారావు పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తూ... ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుండటంతో హతమార్చినట్లు లేఖలో పేర్కొన్నారు. మృతుడు కృష్ణారావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.



Tags

Read MoreRead Less
Next Story