Maoist Letter : వైసీపీ ప్రభుత్వ తీరుపై మావోయిస్టుల ఆగ్రహం

Maoist Letter : వైసీపీ ప్రభుత్వతీరుపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం భూకబ్జాలకు పాల్పడుతూ కోట్లు కూడగట్టుకుంటున్నారని మావోయిస్టు నేతలు ఓ లేఖ విడుదల చేశారు. మూడు రాజధానుల పేరుతో ఇష్టారాజ్యంగా భూఆక్రమణలు చేస్తున్నారని ఆంధ్ర-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ, మావోయిస్టు కార్యదర్శి గణేష్ ఆరోపించారు. విశాఖ నగరం చుట్టు వేల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు. కొత్త జిల్లాల కేంద్రాల్లోనూ జోరుగా భూ ఆక్రమణలు జరిగాయని వెల్లడించారు.
ఇటు రుషికొండపై కూడా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఆక్రమణలపై ఎవరూ ప్రశ్నించవద్దని ఏపీ టీడీసీ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టూరిజం పేరుతో అరకు ప్రాంతంలో వేలాది వ్యవసాయ భూములు స్వాధీనం చేసుకొని రిసార్ట్ నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఎమ్మెల్యేను నిలదీసిన గిరిజన కుటుంబాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఏంటని మావోయిస్టు నేతలు ప్రశ్నించారు. ప్రజల హక్కులను పాలకవర్గాలు కాలరాస్తుంటే ప్రతి ఘటించక తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com