దుబాయ్‌ నుంచి గన్నవరం వచ్చిన ఓ వివాహిత అదృశ్యం

దుబాయ్‌ నుంచి గన్నవరం వచ్చిన ఓ వివాహిత అదృశ్యం

దుబాయ్‌ నుంచి గన్నవరం వచ్చిన ఓ వివాహిత అదృశ్యమైంది. డిసెంబర్ 16న సాయంత్రం 6 గంటలకు కువైట్‌ నుండి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 32 ఏళ్ల దుర్గ గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. టెర్మినల్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె అక్కడి నుంచి కనిపించలేదు. ఆమె అదృశ్యం మిస్టరీగా మారింది.

17వ తేదీ రాత్రి 11 గంటలకు కువైట్‌ నుంచి ఆమెతో పాటు వచ్చిన పనిమనిషి దుర్గ భర్తకు వాట్సప్‌ లో మెసేజ్‌ పెట్టింది. తన భార్య వస్తున్నట్టే సమాచారం లేకపోవడంతో కంగారు పడ్డ భర్త.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని భార్య దుర్గ వివరాలు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీలో పరిశీలించగా ఆమె టెర్మినల్‌ బయటకు వచ్చినట్టు గుర్తించారు. తరువాత ఎక్కడా సీసీ కెమెరాలో కనిపించలేదు. దీంతో గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు దుర్గ భర్త.


Tags

Read MoreRead Less
Next Story