Rapur RTC Depot : రాపూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎండి తిరుమల రావు

Rapur RTC Depot : రాపూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎండి తిరుమల రావు
X

రాపూరు ఆర్టీసీ డిపోను రాష్ట్ర ఎపిఎస్ఆర్టిసి డిపో ఎండి తిరుమల రావ్ సందర్శించారు. రాపూరు ఆర్టీసీ డిపో పరిసరాల్లో ఆర్టీసి జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తో కలిసి మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాపూరు ఆర్టీసి డిపో స్థితి గతులు, బస్ స్టేషన్ పరిస్థితిని పరిశీలించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, మరొక 300 బస్సులు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరొక 1500 బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పల్లె వెలుగులో కూడా ఏసి, ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని, పల్లెలకు నగరాలకు అనుసంధానమయ్యే ఏసి, ఎలక్ట్రికల్ పల్లెవెలుగు బస్సుల్లో కూడా రానున్న రోజుల్లో స్త్రీ శక్తీ పధకం రానున్న రోజుల్లో ఆమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ విధమైనా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్త్రీ శక్తీ పధకం సంతృప్తి కరంగా అమలు జరిగుతుందని తెలిపారు. ప్రక్క రాష్ట్రాలలో అనేక సమస్యలు రావడం జరిగినా కూడా, మన రాష్ట్రాలలో చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో 129 డిపోల్లో 60 డిపోల్లో ఆక్యూపెన్సి వంద శాతం దాటిందని, సాదారణంగా ఆక్యూపెన్సి 68 నుండి 70 శాతం వచ్చేదని అలాంటిది 120 నుండి 130 దాటి విజయవంతంగా స్త్రీ శక్తీ పధకం అమలు అవుతుందని తెలిపారు. అంతకు ముందు సుమారు 40 మహిళలు, 60 మంది పురుషులు బస్సు ప్రయాణం చేసే వారని, ప్రస్తుతం రివర్స్ అయి కొన్ని డిపోలో 65శాతం మహిళలు, 35శాతం పురుషులు ప్రయాణిస్తున్నారని అన్నారు. రెవిన్యూ కలెక్షన్ ఉచితం అయినప్పటికీ ఆ లోటు పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్త్రీ శక్తీ పధకం ఎక్కడ కూడా సమస్య రాలేదని, వైజాగ్ లొ వచ్చిన సమస్య కూడా స్త్రీ శక్తీ పధకం వల్ల కాదని ఈ సందర్బంగా తెలిపారు. అలాగే బస్సులు ఫెయిల్ అవ్వడం కానీ, సీరియస్ కంప్లైయంట్ కానీ, పక్క రాష్ట్రాల మాదిరి దాడులు లేకుండా స్త్రీ శక్తీ పధకం సజావుగా సాగుతుందని తెలిపారు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్త్రీ శక్తీ పధకం మొదలైనప్పటికి ఉన్న బస్సులను మరమ్మతులు మాత్రమే చేసుకుని బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లొ జీరో హవర్ డ్రైవర్ లకు, కండక్టర్ లకు, గారేజ్ సిబ్బందికి సన్మానం చేసి బహుమతులు అందచేయడం జరిగింది.

Tags

Next Story