Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా కలకలం

Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా కలకలం
X
24 గంటల్లో 19 మందికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో 19 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. కలుషిత నీరే కారణమని భావిస్తున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బాధితులను పరామర్శించారు. ప్రజలు నీటిని మరిగించి తాగాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది. ఇటు, మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

రాజమహేంద్రవరం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు

రా­జ­మ­హేం­ద్ర­వ­రం­లో­ని చౌ­డే­శ్వ­రి నగ­ర్‌, స్వ­రూ­ప్‌ నగ­ర్‌­లో స్థా­ని­కు­లు అస్వ­స్థ­త­కు గు­రైన ఘట­న­పై ఏపీ సీఎం చం­ద్ర­బా­బు అసెం­బ్లీ­లో ప్ర­క­టన చే­శా­రు. ఈ ఘటన చాలా బా­ధా­క­ర­మ­న్నా­రు. లా­లా­చె­రు­వు ప్రాం­తం­లో నలు­గు­రు చని­పో­యా­ర­ని.. ఎని­మి­ది మంది ఆస్ప­త్రి­లో చి­కి­త్స పొం­దు­తు­న్నా­ర­ని చె­ప్పా­రు. వా­రి­లో ఇద్ద­రి పరి­స్థి­తి వి­ష­మం­గా ఉం­ద­ని పే­ర్కొ­న్నా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు ప్ర­భు­త్వం తర­ఫున రూ.10 లక్షల చొ­ప్పున ఆర్థిక సాయం అం­ది­స్తా­మ­న్నా­రు. వర­ల­క్ష్మి డె­యి­రీ­కి చెం­దిన కల్తీ పాల వల్లే పలు­వు­రు అస్వ­స్థ­త­కు గు­రై­న­ట్లు ప్రా­థ­మి­కం­గా ని­ర్ధా­రణ అయిం­ద­ని పే­ర్కొ­న్నా­రు. సె­క్ష­న్ 194 కింద బా­ధ్యు­ల­పై కేసు నమో­దు చే­శా­మ­న్నా­రు. సా­మా­జిక సమా­న­త్వం అనే లక్ష్యం కోసం ఎన్డీ­యే కూ­ట­మి ప్ర­భు­త్వం పని చే­స్తోం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. సం­క్షేమ బడ్జె­ట్‌ కే­టా­యిం­పు­ల­పై ఆయన మా­ట్లా­డు­తూ.. రా­జ­కీ­యం­గా కూడా వె­ను­క­బ­డిన వర్గా­ల­కు ప్రా­ధా­న్యం కల్పిం­చే­లా చర్య­లు తీ­సు­కుం­టు­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు.

చౌడేశ్వరినగర్‌లో ఇంటింటా సర్వే

రా­జ­మ­హేం­ద్ర­వ­రం­లో­ని లా­లా­పేట చె­రు­వు చౌ­డే­శ్వ­రి నగ­ర్‌ ప్రాం­తం­లో ఇం­టిం­టా సర్వే ని­ర్వ­హి­స్తు­న్న­ట్లు తూ­ర్పు­గో­దా­వ­రి జి­ల్లా కలె­క్ట­ర్‌ కీ­ర్తి చే­కూ­రి తె­లి­పా­రు. జి­ల్లా అధి­కా­రు­లు మీ­డి­యా సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. ప్ర­భు­త్వం తర­ఫున చే­ప­ట్టిన చర్య­ల­ను వి­వ­రిం­చా­రు. కల్తీ పా­ల­తో అస్వ­స్థ­త­కు గు­రై­న­ట్లు ఆరో­ప­ణ­లు వచ్చి­నం­దున పూ­ర్తి­స్థా­యి­లో వి­చా­రణ చే­ప­ట్టి­న­ట్లు తె­లి­పా­రు. పాలు పో­సిన వ్యా­పా­రి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­ని వి­చా­రి­స్తు­న్నా­మ­న్నా­రు. ఈ ఘట­న­పై సమీ­క్ష ని­ర్వ­హి­స్తు­న్నా­మ­ని జి­ల్లా ఎస్పీ నర­సింహ కి­షో­ర్‌ చె­ప్పా­రు.

Tags

Next Story