AP: సంక్రాంతి తర్వాత మంత్రిగా నాగబాబు ప్రమాణం..!

మెగా బ్రదర్, జనసేన కీలక నేత నాగబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉండగా..ఆ స్థానానికి జనసేన నుంచి నాగబాబుకు అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో నాగబాబు మంత్రి పదవి అంశం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలిసింది.
ఏ శాఖ కేటాయిస్తారో..
మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణ స్వీకారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఓకే అన్నా అప్పుడు గవర్నర్ కు సమాచారం పంపుతానని చంద్రబాబు.. పవన్‌కు సూచించారు. సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం సీీఎం,డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుడే ఖరారు చేద్దామని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగబాబు మంత్రి పదవి అంశం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలిసింది. నాగబాబుకు ఏ మంత్రిత్వశాఖ కేటాయించాలనే దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాలోచనలు చేసినట్లు సమాచారం. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయించాలనే దానిపైనా చర్చించినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారం తర్వాత నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారని సమాచారం.
కీలక అంశాలపై చర్చ
నాగబాబు మంత్రి పదవి అంశంతో పాటుగా ఇటీవల ఏపీలో సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, ఇతర అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. సాగునీటి సంఘాల ఎన్నికల తరహాలోనే సహకార సంఘాల ఎన్నికల్లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com