10 March 2021 4:00 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / నష్టాల సాకుతో...

నష్టాల సాకుతో ప్రైవేటీకరణ సరికాదు : చిరంజీవి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు పలికారు. ఉక్కు సంకల్పంతో విశాఖ ప్లాంటును కాపాడుకుందామంటూ ట్వీట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

నష్టాల సాకుతో ప్రైవేటీకరణ సరికాదు : చిరంజీవి
X

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు పలికారు. ఉక్కు సంకల్పంతో విశాఖ ప్లాంటును కాపాడుకుందామంటూ ట్వీట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు. తాను నరసాపురం కాలేజీలో చదువుకునే తరుణంలో విశాఖ ఉక్కు ఉద్యమం జరిగిందని... ఆ నాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతున్నాయని తెలిపారు. ఉద్యమం జరిగే రోజుల్లో తాను కూడా బ్రష్‌ చేతబట్టి గోడలపై విశాఖ ఉక్కు సాధిస్తామంటూ నినాదాలు రాశామని గుర్తు చేసుకున్నారు.


Next Story