AP: నారా లోకేశ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు

AP: నారా లోకేశ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు
X
నిర్విరామ కృషి కొనసాగాలన్న మెగాస్టార్.. చంద్రబాబు లక్ష్యాలపై లోకేశ్ కీలక కామెంట్స్

మంత్రి నారా లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచి ఇలానే కొనసాగాలని, మీ సమర్థ సారథ్యంలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాలలో మీరు విజయం సాధించాలి. లక్ష్యాలు సాధించేందుకు మరో అద్భుతమైన సంవత్సరం ఉంది’ అంటూ ట్వీట్ చేశారు..

చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకోవడం తేలిక కాదు: లోకేశ్

చంద్రబాబు తమకు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడం అంత తేలిక కాదని... ఎంత కష్టపడైనా ఆ లక్ష్యాలను చేరుకుంటామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తన చేతిలో చాలా పని ఉందన్న లోకేశ్.. ఊహాగానాలపై స్పందించే తీరిక లేదన్నారు. తమ లక్ష్యమంతా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడపడంపైనే ఉందని అన్నారు. దావోస్ పర్యటనలో ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.

డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ రియాక్షన్ ఇదే

నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ పర్యటనలో ఉన్న లోకేశ్‌ను పలకరించిన జాతీయ మీడియా డిప్యూటీ సీఎం ఇష్యూపై క్వశ్చన్ చేసింది. తాను రాజకీయంగా మంచి పొజిషన్‌లో ఉన్నానని, తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నానని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనేది తమ ప్రయత్నమన్నారు. డిప్యూటీ సీఎం ఇష్యూపై క్లారిటీ ఇవ్వలేదు.

పారిశ్రామిక వేత్తలతో లోకేశ్‌ కీలక చర్చలు

మంత్రి నారా లోకేశ్‌ దావోస్‌ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా అపోలో టైర్స్‌ వైస్‌ ఛైర్మన్‌ నీరజ్‌ కన్వర్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్‌ను, నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా R&B కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతోనూ లోకేశ్‌ సమావేశమయ్యారు. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీకి సహకరించాలని కోరారు.

Tags

Next Story