PAWAN: పవన్ స్పీచ్‌కు మంత్రముగ్ధుడినయ్యా

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యానని మెగాస్టార్ చిరంజీవి Xలో పోస్ట్ చేశారు. 'మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.' అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు.
జనసేనకు చంద్రబాబు శుభాకాంక్షలు
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులకు ఎక్స్ వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో కలిసి ఉన్న ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు.
పవన్ అన్న అంటూ లోకేశ్ ట్వీట్
జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నకు శుభాకాంక్షలంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయమని లోకేశ్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి, శ్రేయస్సులో జనసేన పాత్ర కీలకమని, ఏపీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు నాగబాబు కృతజ్ఞతలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగిన కొణిదెల నాగబాబు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. తన బాధ్యతను పెంచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి కృతజ్ఞతలు అని చెప్పారు. తనతో పాటు ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు అంటూ నాగబాబు 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com