నెల్లూరు జిల్లాలో ఐదుగురు కూలీలకు అస్వస్థత.. ఓ కూలీ మృతి

X
By - Nagesh Swarna |12 Dec 2020 3:57 PM IST
నెల్లూరు జిల్లా వెరుబోట్లలో ఐదుగురు కూలీలకు అస్వస్థత గురయ్యారు. వరినాట్ల కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 30 మంది కూలీలు.. కొన్నిరోజులుగా బస్ స్టేషన్‌లో, ఆరుబయట నివసిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు కూలీలు నివసిస్తున్న ప్రాంతాలు జలమయమయ్యాయి. కలుషిత నీరు తాగడం, అపరిశుభ్ర వాతావరణంలో నివసించడమే అస్వస్థతకు కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. అస్వస్థతకు గురైన ఐదుగురిని తోటి కూలీలు
పొదలకూరు హాస్పిటల్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన ఐదుగురిలో ఓ కూలీ మృతి చెందారు. మిగిలిన నలుగురు చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com