కోవిడ్‌ నిబంధనలను తుంగలో తొక్కిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ నిబంధనలను మంత్రివర్యులే యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. ఈ సారి సాక్షాత్తూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కొవిడ్‌ నిబంధనలను తుంగలో తొక్కారు. వేలాది మంది కార్యకర్తలతో విజయనగరం జిల్లా చీపురు పల్లిలో పాదయాత్ర నిర్వహించారు. భారీ బహిరంగ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వేలాది మంది మాస్కులు లేకుండానే సమావేశంలో పాల్గొన్నారు..

సాక్షాత్తూ మంత్రులే కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి పాదయాత్ర చేపట్టడంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజలు సైతం అధికార పార్టీ నేతలే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా అని మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story