మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పడానికి వీలు లేని పదజాలంతో దూషించిన మంత్రి ధర్మాన

మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై.... ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పడానికి వీలు లేని పదజాలంతో దూషించారు. శ్రీకాకుళం జిల్లా దేశవానిపేటలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణదాసు.. చంద్రబాబుపై ఆవేశంతో ఊగిపోయారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం నడుపుతున్నారని విమర్శించారు. మెడలో కండువా వేసుకుంటే రైతులైపోతారా అంటూ వ్యాఖ్యానించారు.
రాజధాని నుంచి రాజకీయ విమర్శల వరకు ధర్మాన కృష్ణదాసు... ప్రతిపక్షనేతపై కనీస గౌరవం లేకుండా దూషణలు కొనసాగించారు. ధర్మాన కృష్ణదాసు బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలతో... సమావేశంలో పాల్గొన్న వాళ్లు సైతం షాక్‌కు గురయ్యారు..
అటు... ధర్మాన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు అసభ్యంగా మాట్లాడటం దారుణమని అన్నారు. జగన్ మంత్రులు అసహనానికి గురై మాట్లాడుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యత కలిగి ఉండాల్సిన మంత్రులు... బూతులు మాట్లాడుతుంటే జగన్ నియంత్రించలేకపోతున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com