
అనంతపురం జిల్లాలో మంత్రి ముఖ్య అనుచరుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. కళ్యాణ్‌దుర్గం తహశీల్దార్ కార్యాలయం ఎదుట.. మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరుడు బిక్కీ హరి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడి చేరుకున్న పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. దాంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. తన భూమిని అక్రమంగా కాజేసేందుకు.. తిప్పేస్వామి అనే వైసీపీ నేత ప్రయత్నిస్తున్నారని హరి ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి సమీపంలో ఉన్న వంకను ఆక్రమించుకునేందుకు.. తిప్పేస్వామి అధికారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
అటు తిప్పేస్వామి.. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వర్గానికి చెందిన మనిషి అని స్థానికులు అన్నారు. బాధితుడి భార్య కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బిక్కీ లక్ష్మీదేవి అని తెలిపారు. మంత్రి అనుచరుడి ఆత్మహత్యాయత్నం అనంతలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఏపీలో ప్రజలు ఆస్తులకే కాదు అధికార పార్టీ నేతలకు చెందిన భూములకు రక్షణ లేకుండాపోయిందని వైసీపీ శ్రేణులే విమర్శలు గుప్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com