Vijayawada : మహిళల్ని బెదిరించి మరీ కూర్చోబెట్టిన మంత్రి జోగిరమేష్..

Vijayawada : మహిళల్ని బెదిరించి మరీ కూర్చోబెట్టిన మంత్రి జోగిరమేష్..
X
Vijayawada : విజయవాడలో వైఎస్ఆర్‌ చేయూత కార్యక్రమంలో మంత్రి జోగిరమేష్‌ రెచ్చిపోయారు

Vijayawada : విజయవాడలో వైఎస్ఆర్‌ చేయూత కార్యక్రమంలో మంత్రి జోగిరమేష్‌ రెచ్చిపోయారు. ఈ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మహిళల్ని బెదిరింపులకు గురి చేశారు. నలుగురు మహిళలు వెళ్లిపోతున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... వెళ్తున్న వారి పేర్లు రాసుకోవలాంటూ అధికారుల్ని ఆదేశించారు.

ప్రజల కోసమే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కొద్దిసేపు కూడా కూర్చోలేరా అంటూ ప్రశ్నించారు. మహిళల్ని బెదిరించి మరి కూర్చోబెట్టారు మంత్రి జోగి రమేష్‌. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు.

Tags

Next Story