అమరావతిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

అమరావతిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ శాసన రాజధాని కూడా వద్దని నేరుగా సీఎంను కలిసి వివరించారు. అన్నిపక్షాలతో మాట్లాడి దానిపై నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు అంటూ మంత్రి పేరుతో ఆయన కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఇదంతా చూస్తుంటే రాజధానిపై మరో కుట్రకు తెరతీసినట్టే కనిపిస్తోందని అమరావతి రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలపై కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడంపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పట్టాలు వద్దన్నప్పుడు శాసన రాజధానిగా అమరావతి ఎందుకు అనేది ఆయన ప్రశ్న.
Next Story