AP: పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు

దుకాణాలకు అత్యంత పారదర్శకంగా కేటాయింపులు చేస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ, నూతన ఎక్సైజ్ పాలసీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. మద్యం దుకాణాల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. సిండికేట్లకు సహకరించే వారిని ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా మద్యం షాపులు కేటాయించాలని, ఆక్రమార్కులకు పాల్పడినట్టు ఏవైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 16 నాటికి రాష్ట్రమంతా కొత్త షాపులు, మద్యం విధానం అమలులోకి రావాలని తెలియజేశారు.
నాణ్యమైన మద్యం సరఫరా..
వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా ఇటీవల 3,336 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని మంత్రి కొల్లు చెబుతున్నారు. మద్యం షాపు పొందేందుకు దరఖాస్తు ఫీజ్ రెండు లక్షలు చెల్లించి డ్రాలో పాల్గొనవచ్చని, ఇప్పటివరకు దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.400కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాతి దశలో గీత కార్మికులకు 10 శాతమైన 340 షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డ్రా నిర్వహిస్తామన్నారు. భారత దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఒక మనిషి ఎన్ని దరఖాస్తులైన చేసుకొని డ్రాలో పాల్గొనవచ్చని, ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో కూడా ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. మద్యం షాపులు పొందేందుకు సిండికేట్లు చేసినట్లు ప్రభుత్వ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ట
57,709 దరఖాస్తులు
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులు అందాయి. బుధవారం ఒక్కరోజే 16,361 వచ్చాయి. రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ. 1,154.18 కోట్ల ఆదాయం సమకూరింది. ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువును ఈ నెల 11 వరకు పొడిగించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com