Minister Nara Lokesh : మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు

నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం పై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్నారు మంత్రి నారా లోకేష్. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు మంత్రి నారా లోకేష్ . నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేష్. నేపాల్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఏపీకు చెందిన తెలుగువారిని సురక్షితంగా తరలించేందుకు కసరత్తులు చేపట్టారు. నేపాల్ లో ప్రస్తుతం 187 మంది తెలుగువారు ఉన్నట్లు గుర్తించిన అధికారులు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఇవ్వాళ అనంతపురం లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభను లోకేష్ రద్దు చేసుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com