పెట్రేగుతున్న మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు

పెట్రేగుతున్న మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అరాచకాలకు అడ్డేలేదు. పుంగనూరు నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అరాచకాలకు అడ్డేలేదు. పుంగనూరు నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. ఇక పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి దోపిడీకి, దాష్టీకానికి హద్దే లేదు. పర్యావరణాన్ని ఎడాపెడా ధ్వంసం చేస్తున్నా అడ్డుకునేవారు ఉండరు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇటు పుంగనూరు.. అటు తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఏకంగా నియంత పాలన సాగిస్తున్నారంటే పెద్దాయన సామ్రాజ్యం ఎంతలా ఉందో అద్దం పడుతోంది. ముదివేడుల్లో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన కళ్లకు కడుతోంది. ప్రాజెక్టుల నిర్మాణంతో సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే నిర్మాణాలు ప్రారంభించడం పెద్దిరెడ్డి దాష్టీకానికి అద్దంపడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఆవులపల్లిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి 667.20 కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చింది. అలాగే పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో ఒక టీఎంసీ రిజర్వాయర్‌ నిర్మాణానికి 717.80 కోట్లకు ఖరారు చేసింది. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడులో 2 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే జలాశయానికి 759.50 కోట్లతో 2020 సెప్టెంబరు 2న ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మొత్తంగా 2 వేల 144.50 కోట్లతో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గాలేరు- నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి అనుసంధానం ద్వారా ఆ మూడు రిజర్వాయర్లలో నీళ్లు నింపాలనేది ప్రతిపాదన. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు తెరలేపారు.

Tags

Read MoreRead Less
Next Story