పెద్దిరెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టు తీర్పు

తుదిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని.. డీజీపీకి ఎస్‌ఈసీ జారీ ఆదేశాలు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును మధ్యాహ్నం 12గంటలకు వెళ్లడిస్తామని తెలిపింది. ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య వరుస వివాదాలు, న్యాయస్థానాల్లో విచారణల నేపథ్యంలో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు మాత్రం మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేశారని పెద్దిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి తరఫున సీవీ మోహన్‌రెడ్డి, ఎస్‌ఈసీ తరఫున ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అటు.. ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం కావాలని ఎస్‌ఈసీ ఆదేశాలు ఉన్నా.. పెద్దిరెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com