మంత్రి శంకర్‌నారాయణ మాటలకు ప్రభుత్వాసుత్రి వైద్యురాలు కంటతడి

మంత్రి శంకర్‌నారాయణ మాటలకు ప్రభుత్వాసుత్రి వైద్యురాలు కంటతడి
తమను సస్పెండ్ చేసినా తాము సిద్ధమే అని సూపరిడెంటెంట్ డాక్టర్ బుడెంసాబ్ తెలిపారు.

రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకర్‌నారాయణ మాటలకు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు కంటతడి పెట్టుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో చోటుచేసుకుంది. నిన్న రాత్రి సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో నీళ్ల సమస్యతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు గాయాలయ్యాయి. దీంతో వారిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మంత్రి శంకర్‌నారాయణ ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వైద్యుల విధులు, ఆస్పత్రిలో సౌకర్యాలపై మంత్రి.. వైద్యురాలు సుకన్యను అడిగి తెలుసుకున్నారు.

అయితే ప్రభుత్వాసుత్రిలో సిబ్బంది కొరత ఉందని.. సరైన వైద్య పరికరాలు లేవని మంత్రి శంకర్‌నారాయణకు వైద్యురాలు తెలిపింది. దీంతో వైద్యురాలు సుకన్యపై మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోపాన్ని ప్రదర్శించారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్న మంత్రి.. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. వెంటనే అందరినీ సస్పెండ్ చేయాలని DCSH రామేష్‌నాథ్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో వైద్యురాలు సుకన్య మంత్రి ఎదుటే కంటతడి పెట్టుకున్నారు.

మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన సూపరిడెంటెంట్ ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది లేరని తెలిపారు. ఆరుగురు సిబ్బంది ఉండాల్సిన ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు మాత్రమే 24 గంటల పాటు పనిచేస్తున్నారన్నారు. తమను సస్పెండ్ చేసినా తాము సిద్ధమే అని సూపరిడెంటెంట్ డాక్టర్ బుడెంసాబ్ తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story