సామాన్యుల పాలిట శాపంగా మారిన వైసీపీ నేతల అధికార దర్పం

వైసీపీ నేతల అధికార దర్పం... సామాన్యుల పాలిట శాపంగా మారింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి బూతు పురాణం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇసుక యార్డ్ ఇంఛార్జితో ఫోన్‌లో రామచంద్రారెడ్డి దుర్భాషలాడిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇసుక లోడింగ్ గురించి ఫోన్‌లో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పడానికి వీలుకాని భాషలో తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే తీరుపై... విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అనుచరులు దౌర్జన్యకాండకు దిగారు. రోడ్లు బాగాలేవని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని ప్రశ్నించిన ఆటో డ్రైవర్ రవికుమార్‌పై రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నాడన్న నెపంతో ఆటో డ్రైవర్ రవికుమార్‌ను కారులో ఎక్కించుకుని.. ఊరిబయటకు తీసుకెళ్లి చితకబాదారు. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అనుచరులపై మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని... నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు స్థానిక నేతలు కూడా ఈ ఘటనను ఖండించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడ్డారు.
ఏపీలో రోజురోజుకు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్ట్యారీతిన వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తు దాడులు చేస్తున్న వైసీపీ నాయకులు.. ఇప్పుడు సామాన్య జనంపైనా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి దాడులు చేస్తూ.. రాష్ట్రంలో భయోత్పాపం సృస్టిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com