CBN: అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్..!

సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ అంగీకరించినట్టు ఆయన తెలిపారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ముందుకొచ్చినట్టు వెల్లడించారు.
లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు కీలక భేటీ
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఇన్‌వెస్ట్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యి, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అన్నీ అవకాశాలు ఉన్నాయని.. ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు.
ఆంధ్రాలో గోల్ఫ్ కోర్టు.. లోకేష్‌తో చర్చలు
రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేసేందుకు స్టోన్‌క్రాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. మంత్రి లోకేష్‌తో భేటీ అయిన ఈ సంస్థకు చెందిన అధికారులు, వరల్డ్ క్లాస్ గోల్ఫ్ కోర్టును ఆంధ్రాలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఇందులో విలాసవంతమైన వసతి, టాప్‌టైర్ గోల్ఫింగ్ సౌకర్యాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచ పర్యాటకులను, పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com