AP: పడిపడి నవ్విన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

AP: పడిపడి నవ్విన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
X

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. ఇందులో భాగంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రజా ప్రతినిధులు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పండించారు. వీరి నటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ డ్రామా ఆద్యంతం నవ్వులు కురిపించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రామా చేశారు. ఒక్కొక్కరు ఒక్కో పాత్రలో ఒదిగిపోయారు. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేసిన స్కిట్ అందర్నీ నవ్వుల్లో ముచ్చేత్తింది. సమయం సందర్భంగా లేకుండా పనికి మాలినోడు చేసే పనులపై స్కిట్ చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ పగలబడి నవ్వారు. పవన్ కల్యాణ్ అయితే కూర్చున్న సీట్లో ఎగిరెగిరిపడి నవ్వుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలను చంద్రబాబు, పవన్ ప్రశంసించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మంచి అనుభవాలను తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story