నెల్లూరులో టెన్షన్..ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్

నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నేడు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు కోటంరెడ్డి. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక పోలీసుల తీరుపై శ్రీధర్ రెడ్డి అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటంరెడ్డి హౌస్ అరెస్ట్‌తో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీధర్‌రెడ్డి నిరసనకు పోలీసులు అనుమతిలేదన్నారు. శ్రీధర్‌రెడ్డికి నోటీసులిచ్చారు. దీంతో ఇంటి వద్దే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బైఠాయించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అనుచరులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com