కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప్రశ్నల వర్షం

కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప్రశ్నల వర్షం
ప్రజల కోసం ఏం చేశారో చెప్పడానికి మీకు ఏమీ లేదు.. చెట్ల నరికివేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కేతిరెడ్డి కుటుంబం కాదా అంటూ నిలదీశారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరపత్రాల కలకలం రేగింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మూడో విడత యాత్ర సందర్భంగా కరపత్రాల పంపిణీ హాట్‌ టాపిక్‌గా మారింది. కరపత్రాల ద్వారా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల కోసం ఏం చేశారో చెప్పడానికి మీకు ఏమీ లేదు.. చెట్ల నరికివేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కేతిరెడ్డి కుటుంబం కాదా అంటూ నిలదీశారు. నేరస్తులకు ఆశ్రయ మిచ్చే సంస్కృతి నీదే కదా పెద్దారెడ్డీ అంటూ క్వశ్చన్ చేశారు. దోచుకోవడం.. దాచుకోవడం గురించి నువ్వు మాట్లాడితే బాగుండదు పెద్దారెడ్డి అంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ కరపత్రాలను పంపిణీ చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నలుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Tags

Read MoreRead Less
Next Story