ఆ ఆడియోలో వాయిస్ నాది కాదు : ఎమ్మెల్యే శ్రీదేవి

ఆ ఆడియోలో వాయిస్ నాది కాదు : ఎమ్మెల్యే శ్రీదేవి
X

తనపై వైసీపీ కార్యకర్త సందీప్ చేసిన ఆరోపణలను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. సందీప్ విడుదల చేసిన ఆడియోలో వాయిస్ తనది కాదని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ ఆడియోలో వాయిస్ తనదే అయితే పోలీసులకు ఇవ్వాలని సూచించారు. తన వాయిస్ ను మార్ఫింగ్ చేసి తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సందీప్, సురేష్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. సందీప్, సురేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. వారిద్దరి వెనుక ఓ నేత ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఆ నేతపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుచేస్తానని హెచ్చరించారు.



Tags

Next Story