MLC Kavita: దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ చక్రం తిప్పుతుంది: ఎమ్మెల్సీ కవిత

X
By - Prasanna |17 Feb 2022 4:58 PM IST
MLC Kavita: 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతై తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన బీజేపీ.. తమపై దుష్ప్రచారం చేయడమేంటని కవిత విమర్శించారు.
MLC Kavita: దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తిరుపతి సమీపంలో ఉన్న మంగళం వృద్ధాశ్రమంలో జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన కవిత.. వృద్ధులతో ఆప్యాయంగా మాడ్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపడం ఆనందంగా ఉందని తెలిపారు. 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతై తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన బీజేపీ.. తమపై దుష్ప్రచారం చేయడమేంటని కవిత విమర్శించారు. మంగళం వృద్ధాశ్రమం నుంచి అలిపిరి చేరుకున్న కవిత.. కాలినడక మార్గం నుంచి తిరుమలకు బయల్దేరి వెళ్లారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com