AP: ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం

దేశంలో ఐదు రాష్ట్రాలకు విపత్తులు, వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. విపత్తు, వరదల సాయం కింద ఐదు రాష్ట్రాలకు మొత్తం రూ. 1,554.99 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిధులు విడుదలకు ఆమోదం లభించింది. అత్యధికంగా ఏపీకి రూ. 608.08 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ. 231.75 కోట్లు కేటాయించింది. అలాగే నాగాలాండ్‌కు రూ. 170.99 కోట్లు, ఒరిస్సాకు రూ. 255.24 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్ల నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. గత 2024 సంవత్సరంలో వరదలు, విపత్తు కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం కొంతమేర నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదనంగా రూ. 1,554.99 కోట్లను విడుదల చేసింది.
చంద్రబాబు ధన్యవాదాలు
కేంద్ర విపత్తు, వరద సాయం కింద రాష్ట్రానికి కేంద్రం రూ. 608 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్రం రూ. 1554.99 కోట్ల నిధులు కేటాయించగా.. అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ సాయం ప్రకటించింది.
మంత్రి దుర్గేశ్ కృతజ్ఞతలు
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం కలిశారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు అఖండ గోదావరి, గండికోటలకు నిధులు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సెంటర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి షెకావత్ సుముఖంగా ఉన్నట్లు దుర్గేశ్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com