MODI: జగన్ విమర్శలను తిప్పికొట్టండి:మోదీ

MODI: జగన్ విమర్శలను తిప్పికొట్టండి:మోదీ
X
ఏపీ బీజేపీ నేతలకు మోదీ దిశా నిర్దేశం.. చంద్రబాబు పాలన భేష్ అన్న ప్రధాని... ఏపీ, తెలంగాణ ఎంపీలతో అల్పహారం.. 15 మంది ఎంపీలతో అరగంట భేటీ

ఏపీ­లో పా­ల­న­పై ప్ర­ధాన మం­త్రి నరేం­ద్ర మోదీ ప్ర­శం­సల వర్షం కు­రి­పిం­చా­రు. చం­ద్ర­బా­బు పాలన భేష్ అంటూ కి­తా­బి­చ్చా­రు. గు­రు­వా­రం ఉదయం ఏపీ , తె­లం­గాణ ఎన్డీ­యే ఎం­పీ­ల­తో కలి­సి ప్ర­ధా­ని మోదీ అల్పా­హార విం­దు­లో పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా ఏపీ­లో చం­ద్ర­బా­బు పాలన చాలా బా­వుం­ద­ని ప్ర­శం­సిం­చా­రు. పె­ట్టు­బ­డు­లు కూడా ఏపీ­కి ఎక్కు­వ­గా వస్తు­న్నా­య­ని ప్ర­ధా­ని వె­ల్ల­డిం­చా­రు. ఏపీ­లో పా­ల­న­ను పొ­గ­డ్త­ల­తో ముం­చె­త్తారు. ఏపీ, తె­లం­గాణ రా­ష్ట్రాల ఎం­పీ­ల­కు ప్ర­ధా­ని మోదీ అల్పా­హార విం­దు ఇచ్చా­రు. ఎం­పీ­ల­తో సు­మా­రు అర­గంట పాటు మోదీ మా­ట్లా­డా­రు. ఏపీ­లో చం­ద్ర­బా­బు­తో కలి­సి ముం­దు­కు సా­గ­డం మంచి పరి­ణా­మ­మ­ని, ఆయన పాలన కూడా బే­షు­గ్గా ఉం­ద­ని కొ­ని­యా­డా­రు. పూ­ర్తి సమ­న్వ­యం­తో ముం­దు­కు వె­ళ్తు­న్నా­ర­ని తె­లి­పా­రు. చం­ద్ర­బా­బు పరి­పా­ల­న­పై కూడా మంచి ఫీడ్ బ్యా­క్ వచ్చిం­ద­ని ప్ర­ధా­ని కి­తా­బి­చ్చా­రు. ఏపీ­కి ఎక్కు­వ­గా పె­ట్టు­బ­డు­లు వె­ళ్తు­న్నా­య­ని.. ఇది శు­భ­ప­రి­ణా­మ­మ­న్నా­రు. రా­బో­యే రో­జు­ల్లో ఏపీ చాలా అభి­వృ­ద్ధి చెం­దే అవ­కా­శం ఉం­ద­ని ప్ర­ధా­ని పే­ర్కొ­న్నా­రు. అలా­గే జగన్ పా­ర్టీ­ని, సో­ష­ల్ మీ­డి­యా­లో ఆ పా­ర్టీ చే­స్తు­న్న వి­మ­ర్శ­ల­కు బీ­జే­పీ నే­త­లు ధీ­టు­గా కౌం­ట­ర్ ఇవ్వా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు.

బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం

తె­లం­గా­ణ­లో ఓవై­సీ సో­ష­ల్ మీ­డి­యా కంటే బీ­జే­పీ సో­ష­ల్ మీ­డి­యా చాలా తక్కు­వ­గా ఉం­ద­ని, బీ­జే­పీ నే­త­లు సో­ష­ల్ మీ­డి­యా­లో యా­క్టి­వ్‌­గా ఎం­దు­కు ఉం­డ­టం లే­ద­ని తె­లం­గాణ బీ­జే­పీ ఎం­పీ­ల­పై ప్ర­ధా­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. తె­లం­గా­ణ­లో ఎది­గేం­దు­కు అవ­కా­శా­లు ఉన్నా­య­ని, కనీ­సం ప్ర­తి­ప­క్ష పా­త్ర కూడా సరి­గ్గా పో­షిం­చ­డం లే­ద­ని ఎం­పీ­ల­పై మం­డి­ప­డి­న­ట్లు తె­లు­స్తోం­ది. మంచి టీ­మ్‌­ను పె­ట్టు­కు­ని సమ­ర్థ­వం­తం­గా ఎదు­ర్కో­వ­డా­ని­కి ఉన్నా కూడా సమ­స్య ఏంటి అని ప్ర­శ్నిం­చి­న­ట్లు సమా­చా­రం. తె­లం­గా­ణ­లో పా­ర్టీ పె­ర­గ­డా­ని­కి మంచి అవ­కా­శం ఉన్న­ప్ప­టి­కీ దా­న్ని ఉప­యో­గిం­చు­కో­వ­డం­లో వి­ఫ­లం అవు­తు­న్నా­ర­ని ప్ర­ధా­ని మోదీ ఆవే­దన వ్య­క్తం చే­సి­న­ట్లు సమా­చా­రం. ‘‘తె­లం­గా­ణ­లో ప్ర­తి­ప­క్ష పా­త్ర కూడా పో­షిం­చ­డం లేదు. మంచి టీ­మ్‌­ని పె­ట్టు­కు­ని సమ­ర్థం­గా ఎదు­ర్కో­వ­డా­ని­కి సమ­స్యేం­టి? రా­ష్ట్రం­లో పా­ర్టీ గ్రా­ఫ్‌ పె­ర­గ­డా­ని­కి మంచి అవ­కా­శం ఉన్నా దా­న్ని ఉప­యో­గిం­చు­కో­వ­డం­లో వి­ఫ­ల­మ­వు­తు­న్నా­రు’’ అని మోదీ ఆగ్ర­హం వ్య­క్తం చే­సి­న­ట్లు సమా­చా­రం. జా­తీయ పరి­ణా­మా­ల­పై తె­లు­గు ఎం­పీ­లు యా­క్టి­వ్‌­గా ఉం­డా­ల­ని, పలు రా­ష్ట్రా­ల్లో పర్య­టిం­చి ఆయా అం­శా­ల­ను ప్ర­జల దృ­ష్టి­కి తీ­సు­కె­ళ్లే ప్ర­య­త్నం చే­యా­ల­ని ఆయన సూ­చిం­చా­రు.

Tags

Next Story