మద్యం కుంభకోణంలో ఏసీబీ కోర్టుకు హాజరైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ

మద్యం కుంభకోణంలో ఏసీబీ కోర్టుకు హాజరైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ

మద్యం కుంభకోణంలో ఏసీబీ కోర్టు విచారణకు హాజరయ్యారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. 2012కి సంబంధించిన ఈ కేసులో మోపిదేవి సహా మరికొందరిపై గతంలోనే అభియోగాలు నమోదు అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వ్యాపారి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ ఏళ్ల తరబడి పెడింగ్‌లోనే ఉంది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ త్వరగా తేల్చాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ ACB కేసు విచారణను ఈ 19 నుంచి రోజువారీ విచారణకు షెడ్యూల్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసులో ఒక నిందితుడిని ప్రశ్నిస్తున్న సందర్భంలో మోపిదేవి పేరు బయటకు వచ్చింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సిండికేట్ వ్యవహారాల్లో ఇబ్బందుల్లేకుండా చూసేందుకే 10 లక్షలు ఇచ్చినట్టు రమణ అనే మద్యం వ్యాపారి చెప్పడం అప్పట్లో సంచలనమైంది. ఈ అంశాన్ని రిమాండ్ రిపోర్ట్‌లోనూ పేర్కొన్నారు. మోపిదేవితోపాటు మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా అప్పుడు బయటకు రావడం కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు రోజువారీ విచారణకు రంగం సిద్ధమవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


Tags

Read MoreRead Less
Next Story