ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ

ఎంపీ అవినాష్ రెడ్డి  బెయిల్ పిటిషన్ పై విచారణ
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బేంచ్ లో అవినాష్ రెడ్డి బెయిల్ పై విచారణ జరుగనుంది

ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వేకెషన్ బెంచ్ లో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో కర్నూలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అటు... సీబీఐ అధికారుల బృందం రాత్రే కర్నూలుకు చేరుకుంది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం.. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. వారం రోజులుగా... అవినాష్ రెడ్డి విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉన్నారు. విశ్వభారతి ఆసుపత్రిలో శ్రీలక్ష్మికి చికిత్సలు కొనసాగుతున్నాయి. అటు.. ఆసుపత్రి వద్ద వైసీపీ అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో... ఆసుపత్రిలో ఉండే రోగులతో పాటు... స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story