బీజేపీ నేతలు కేంద్రంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా మాట్లాడుతున్నారు : ఎంపీ గల్లా జయదేవ్‌

బీజేపీ నేతలు కేంద్రంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా మాట్లాడుతున్నారు : ఎంపీ గల్లా జయదేవ్‌

అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. రాజధానికి మద్దతుగా గుంటూరు నుంచి మహా ర్యాలీ నిర్వహించారు రైతులు. ఈ ర్యాలికి ఎంపీ గల్లా జయదేవ్‌ సంఘీభావం తెలిపారు.

చట్టాలు, రాజ్యాంగాలను గౌరవించని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు గల్లా‌. కేంద్రంలో బీజేపీ నేతలు ఒకలా మాట్లాడితే.. రాష్ట్ర నేతలు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్టికల్‌ 248 ప్రకారం ఒకవేళ కేంద్ర పరిధిలో రాష్ట్రం అంశం లేకపోతే.. పార్లమెంట్‌లో చట్టం చేసే అధికారం ఉంటుందన్నారు. దీనిపై న్యాయం పోరాటం చేస్తామన్నారు గల్లా జయదేవ్‌.

Tags

Read MoreRead Less
Next Story