పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకో : ఎంపీ రఘురామకృష్ణంరాజు
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత దశాబ్దాలుగా వస్తున్న డిక్లరేషన్ ను సీఎం పాటించకపోవడం సరైంది కాదన్నారు ఎంపి రఘురామ కృష్ణ రాజు. ఆనాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు సైతం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన గుర్తుచేశారు. డిక్లరేషన్ ను ఖచ్చితంగా అమలు చేయాలని ఆనాడు గవర్నర్ కూడా ఆదేశించారని.. కానీ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారిని దర్శించుకున్నారని విమర్శించారు. సీఎం సెక్యులర్ అని భావిస్తున్నానని..ఇప్పటికైనా అన్యమతస్తుల భావాలను గౌరవిస్తారని నమ్ముతున్నానన్నారు.
అన్నికులాలు, మతాలపై తనకు గౌరవం.... నమ్మకం ఉందన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. అలాంటిది తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కొందరు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ప్రాంగణంలో తనపై అవాక్కులు, చెవాక్కులు పేలారని ఆయన ధ్వజమెత్తారు. అది వారి మానసిక పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టాలనే పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకోవాలని రఘురామ హితవు పలికారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com