సీఎం జగన్ బెయిలు రద్దు చేయాలి... సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్
సీఎం జగన్ బెయిలు రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణ రాజు CBI కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యతలో భాగంగానే తాను ఈ పిటిషన్ వేసినట్లు రఘురామ స్పష్టం చేశారు.

సీఎం జగన్ బెయిలు రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణ రాజు CBI కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీని, ప్రజా స్వామ్యన్ని రక్షించుకునే బాధ్యతలో భాగంగానే తాను ఈ పిటిషన్ వేసినట్లు రఘురామ స్పష్టం చేశారు. ఏడాదిగా ఒక వ్యక్తి విచారణకు హజరు కాకపోయినా కోర్టులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆరోపణల కారణంగా మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా చేసినప్పుడు.. జగన్ ఎందుకు చేయడన్నారు. కుటుంబ సభ్యుల్లో, కుల సభ్యుల్లో ఎవరో ఒకర్ని తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించి.. మీ కేసుల విచారణకు హాజరవ్వండని రఘురామ సూచించారు.
Next Story