5 Nov 2020 10:23 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / సజ్జల...

సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు కౌంటర్‌

సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు కౌంటర్‌
X

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపి రఘురామరాజు. వైఎస్ఆర్ కంటే వంద రెట్లు ఎక్కువగా జగన్ చేస్తున్నారన్న సజ్జల మాటలను ఖండించారు. దీన్ని తాను విశ్వసించడం లేదన్నారు. భారీ మెజార్టీతో గెలిచాక.. సీఎం జగన్ అయితే బయటకొచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. వైఎస్ లాంటి వారే రెండోసారి పాస్ మార్కులు పొందారన్నారు రఘురామరాజు. ఆలోచనలు బాగున్నా.. ప్రజల్లోకి కార్యక్రమాలను తీసుకెళ్లాలని భావించి రచ్చబండ కార్యక్రమం ఆలోచన చేశారని..అయితే అకాల మరణంతో అది ఆగిపోయిందని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తాను రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించానన్నారు. ఈ సందర్బంగా.. జగన్ తీరును ఎద్దేవా చేస్తూ.. రాజాధిరాజా సినిమాలో పాట వినిపించారు రఘురామరాజు.

Next Story