ఏపీలో దేవాలయాలపై దాడులు : ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ

ఏపీలో దేవాలయాలపై దాడులు : ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 18 నెలలుగా, ఆలయాలపై దాడులు పెరిగాయని లేఖలో తెలిపారు. కనీసం వందకు పైగా దాడులు జరిగాయని రఘురామ కృష్ణ రాజు అన్నారు.

ఇటీవల మూడు గుళ్లలో దశాబ్దాల పురాతన రథాలు కాలిపోయాయన్నారు. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థ దేవాలయంలో ఘటననూ మోదీకి రాసిన లేఖలో రఘురామ ప్రస్తావించారు. 3వ శతాబ్దంలో నిర్మించిన ఆలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని ప్రశ్నిస్తున్న హిందూ సంఘాల నేతల్ని వేధింపులకు గురిచేస్తూ అరెస్టు చేస్తున్నారని రఘురామ లేఖలో తెలిపారు. కరోనా నేపథ్యంలో సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలకు అడ్డు చెప్పనప్పటికీ పరిమిత సంఖ్యలో నిరసన చేస్తామంటున్నవారిని అడ్డుకుంటున్నారని మోదీకి వివరించారు. దేవాలయాల్లో దాడులపై గత పార్లమెంటు సమావేశాల్లోనూ తాను మట్లాడాలని ప్రయత్నించినప్పటికీ సొంత పార్టీ ఎంపీలే కావాలని అడ్డుతగిలారని లేఖలో రఘురామ వివరించారు.

ఏపీ తరుచుగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదన్నారు. కొన్ని ఘటనల్లో ఒకరిద్దరిని అరెస్టు చేసినా వాళ్లను పిచ్చివాళ్లుగా చూపించారని రఘురామ కృష్ణరాజు లేఖలో తెలిపారు. ఆలయాల పరరిక్షణకు సంబంధించి ప్రధాని సహాయం కోరడం తప్ప ఏపీలోని హిందువులకు మరో అవకాశం లేదన్నారు.

ఇక్కడి సంస్కృతిలో భాగమైన దేవాలయాలపై జరుగుతున్న దాడులతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు. దయచేసి ఓ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపి ఇక్కడ జరిగే ఘటనపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. దోషులు ప్రభుత్వంపై ఎంత్త పెద్ద పొజిషన్‌లో ఉన్నాశిక్షించాలన్నారు రఘురామ కృష్ణరాజు.






Tags

Read MoreRead Less
Next Story