అవినాష్ బెయిల్ వాదనలపై ఆర్ఆర్ఆర్ కామెంట్

అవినాష్ బెయిల్ వాదనలపై ఆర్ఆర్ఆర్ కామెంట్

వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఎంపీ రఘురామ కృష్ణం రాజు కామెంట్ చేశారు. కోర్టులో జరుతుగోన్న వాదనలపై తన అభిప్రాయాన్ని తెలిపారు. వచ్చే బుధవారం ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయమూర్తి అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే సీబీఐ మాత్రం తక్షణమే ఉత్తర్వులను ఇవ్వాలని తన వాదనలను వినిపిస్తోందని అన్నారు. ఒకవేల కోర్టు అవినాష్ ను అరెస్టు ఆర్డర్ ఇచ్చినా అది బెయిల్ మాత్రం కాదని తెలిపారు. న్యాయమూర్తి తన తీర్పును ఇంకా వెలువరించకపోతే సీబీఐ తన విచక్షణాధికారాలతో అవినాష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. అయితే తదుపరి జరిగే పరిణామాలను వేచి చూడక తప్పదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story