ఐదేళ్లు పాలించమని పదవి ఇస్తే ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు: రఘురామ

X
ఐదేళ్లు పాలించమని పదవి ఇస్తే.. రాష్ట్రాన్ని ఏపీ ప్రభుత్వం అమ్మేస్తుందని ఎంపీ రఘురామ కృష్ణం రాజు విమర్శించారు. ప్రభుత్వ విధానంపై విమర్శలు గుప్పించిన ఆయన.. జరుగుబాటు కష్టమైతే తిరుగుబాటు మార్గం కాదని హితవు పలికారు. ఇక ఏపీలో అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్స్ దేశంలో ఎక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ హెల్త్ మినిస్టర్‌ను కలిసి.. స్థానికంగా అమ్ముతున్న లిక్కర్ విషయంపై అన్ని వివరాలు తెలిపానని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విధిస్తామని సీఎం జగన్.. ఆ హామీకి తూట్లు పొడిచారని విమర్శించారు. ఇక మద్యం తయారీ దారులకు, ప్రభుత్వంలో పెద్లకు సంబందాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
