ఏపీలో ఇంటికే మద్యం సరఫరా : ఎంపీ రఘురామ కృష్ణరాజు

ఏపీలో అక్రమ కేసులపై రఘ రామ కృష్ణ రాజు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టు భావప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం అని ప్రకటించిందన్నారు. ప్రజల సమస్యలను, రాష్ట్రం కేంద్ర నుండి రాబట్టే నిధులు గురించి తాను ప్రస్తావన చేస్తే... ప్రత్యేక విమానం ఇచ్చి తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంపిలను సీఎం పంపారని గుర్తు చేశారు. అదే పని రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం ఇచ్చిన హామీల సాధన కోసం పంపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు..
సీఎం జగన్ పాలన, మంత్రుల తీరుపై ఎంపీ రఘురామ కృష్ణ రాజునిప్పులు చెరిగారు. ఏపీలో అనాధికారిక బెల్ట్ షాపులు ఎక్కువ అయ్యాయి అన్నారు. ఇంటికే మద్యం సరఫరా చేస్తున్నారని, గతంలో కంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నారు. రాష్ట్రప్రజల శ్రమను కొంత మంది మద్యం వ్యాపారులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com