అసలు సమస్య కరోనా కాదు.. ఢరోనా - ఎంపీ రఘురామ కృష్ణరాజు

రాష్ట్ర ప్రభుత్వం అసలు సమస్య కరోనా కాదని.. ఢరోనా అన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోడానికి భయపడుతోందని అన్నారు. నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభిస్తామంటున్న ప్రభుత్వం.. ఏ భాషలో పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభిస్తారో చెప్పాలి అన్నారు. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటే కోర్టు దిక్కరణ ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు..
సీఎం జగన్ ఆవేశం తగ్గించుకుని.. ఆలోచన పెంచుకోవాలని రఘురామ సలహా ఇచ్చారు. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించడం మంచిదే కాని, పేదవాడు తాగే బ్రాండ్‌ల నాణ్యత పెంచడం కాని, ధరలు తగ్గించడం కాని జరగలేదన్నారు. ఒక వైపు ప్రభుత్వ పథకాల పేరుతో పేదలకు డబ్బు ఇచ్చి, అధిక మద్యం ధరలతో తిరిగి లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com