ఒకరోజు శిక్షపడినా సీఎం పదవికి అనర్హులు : ఎంపీ రఘురామకృష్ణరాజు

వైసీపీ ఒక ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకుంటే బెటరన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం కోర్టు ధిక్కరణగా పరిగణించబడుతుందని..ఒక రోజు శిక్షపడినా సీఎం పదవిలో ఉండటానికి జగన్ అనర్హుడవుతారన్నారు. అటు పోలీసుల లోపాల్ని న్యాయవ్యవస్థపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ అధికారంలో కొనసాగాలంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి ని సిద్ధం చేసుకోవాల్సిందేనని ఆయన సూచించారు.
తిరుపతిలో ఓ యువతిపై క్రైస్తవ పార్టర్ చేసిన అత్యాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణ రాజు డిమాండ్ చేశారు. పక్షపాతం చూపకుండా నేరం చేసిన వారిపై వెంటనే కేసుపెట్టి శిక్షించాలన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై తేలికపాటి కేసులు పెట్టివదిలిపెట్టేప్రయత్నం చేస్తున్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com