మీ కోరికను గౌరవించలేకపోతున్నందుకు క్షమించండి : ముద్రగడ

మీ కోరికను గౌరవించలేకపోతున్నందుకు క్షమించండి : ముద్రగడ

కాపు ఉద్యమంలోకి మళ్లీ రాబోనని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. మీ కోరికను గౌరవించలేకపోతున్నందుకు క్షమించమని కోరుతున్నానను అని తనను కలవడానికి వచ్చిన కాపు నేతలతో ఆయన అన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నేతలు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడను కలిశారు. 13 జిల్లాల నుంచి వచ్చిన నేతలను ముద్రగడ స్వాగతం పలికారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటున్నట్లు గతంలో ముద్రగడ ప్రకటించారు. అయితే మళ్లీ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించడానికి జేఏసీ నేతలు ఆయన స్వగృహానికి వెళ్లి ఉద్యమంపై సమాలోచనలు జరిపారు. కానీ మళ్లీ ఉద్యమంలోకి రాబోనని.. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను అని కాపు నేతలతో ముద్రగడ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story