MUNTHA CYCLONE: రైతన్నను నిండా ముంచేసిన "మొంథా"

MUNTHA CYCLONE: రైతన్నను నిండా ముంచేసిన మొంథా
X
ఏపీలో వేల ఎకరాల్లో వరి పంట నాశనం.. నీట మునిగిన కంకుల దశకు వచ్చిన పంట.. పత్తి, వరి, మిర్చి తోటలకు తీవ్ర నష్టం.. వందల ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసం

‘మొం­థా’ తు­ఫా­న్ వరి రై­తు­ల­ను‌ నిం­డా ముం­చే­సిం­ది. భారీ వర్షా­ల­కు ఈదు­రు­గా­లు తో­డ­వ­డం­తో పం­ట­న­ష్టం మరింత పె­రి­గిం­ది. బా­ప­ట్ల, వే­మూ­రు, రే­ప­ల్లె, తె­నా­లి ప్రాం­తా­ల­లో వేల ఎక­రా­ల­లో వరి నే­ల­వా­లి­పో­యిం­ది. కం­కుల దశకు వచ్చిన వరి పంట పూ­ర్తి­గా నే­ల­కొ­రి­గిం­ది. ఏక­ధా­టి­గా కు­రి­సిన వర్షం­తో రై­తు­లు ఆశ వది­లే­సు­కో­వా­ల్సిన పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. కళ్ల ముం­దే పంట నా­శ­నం అవు­తుం­డ­డం­తో రై­తు­లు ఆవే­దన చెం­దు­తు­న్నా­రు. ప్ర­భు­త్వం తమని ఆదు­కో­వా­ల­ని కో­రు­తు­న్నా­రు.

రైతన్నకు భారీ నష్టం

తు­ఫా­న్ ప్ర­భా­వం­తో ఏపీ­లో­ని దా­దా­పు అన్న జి­ల్లా­ల్లో వరి పం­ట­ల­కు అపార నష్టం వా­టి­ల్లిం­ది. చే­తి­కి అంది వచ్చిన సమ­యం­లో వరి పంట నే­ల­కొ­రి­గిం­ది. ఆరు­గా­లం కష్టిం­చి పం­డిం­చిన వరి పం­ట­లు నే­ల­పా­లు కా­వ­డం­తో రై­తు­లు గగ్గో­లు పె­డు­తు­న్నా­రు. ఎక­రా­ని­కి 30 వేల నుం­డి 40 వేల రూ­పా­యల వరకు నష్టం వా­టి­న­ట్టు వా­పో­తు­న్నా­రు. ఎక­రా­ని­కి 40 బస్తా­లు వచ్చే ది­గు­బ­డి ఇప్పు­డు 10 నుం­డి 20 బస్తా­లు మా­త్ర­మే వచ్చే పరి­స్థి­తి నె­ల­కొం­ద­ని అన్న­దా­త­లు ఆం­దో­ళన చెం­దు­తు­న్నా­రు. తు­పా­ను ప్ర­భా­వం­తో వి­జ­య­న­గ­రం జి­ల్లా­లో భారీ వర్షా­లు కు­రు­స్తు­న్నా­యి. జి­ల్లా­లో­ని గు­ర్ల మం­డ­లం కె­ల్లా ఆర్ఓ­బీ వద్ద వర్ష­పు నీరు చే­ర­డం­తో ప్ర­జ­లు ఇబ్బం­ది పడు­తు­న్నా­రు. జామి మండల కేం­ద్రం­లో వందల ఎక­రా­ల్లో వరి పంట నే­ల­కొ­రి­గిం­ది. వే­పాడ మం­డ­లం­లో­ని బొ­ద్దాం గ్రా­మం­లో ఊర చె­రు­వు గర్భం­లో ఉన్న చె­ట్టు­బ­లి­జ­ల­ను పు­న­రా­వాస కేం­ద్రా­ని­కి వె­ళ్లా­ల్సిం­ది­గా ఎమ్మె­ల్యే కో­ళ్ల లలిత కు­మా­రి సూ­చిం­చా­రు. పో­త­నా­ప­ల్లి వద్ద పంట పొ­లా­లు ము­ని­గి­పో­యి వర్ష­పు నీరు రో­డ్డు మీ­దు­కు చే­రు­తోం­ది. తె­లం­గా­ణ­లో­నూ అనేక గ్రా­మా­ల­లో వా­నా­కా­లం సాగు చే­ప­ట్టిన పత్తి, వరి పంట ఇటీ­వల వే­సిన మి­ర్చి తో­ట­ల­కు తీ­వ్ర నష్టం వా­టి­ల్లిం­ది. ఇప్ప­టి­కే వరుస వర్షా­ల­తో పత్తి చేలు ఊట­బ­ట్టి పోగా ది­గు­బ­డి పూ­ర్తి­గా తగ్గిం­ది. ఈ తరు­ణం­లో చే­తి­కి వచ్చిన పం­ట­ను తీసే క్ర­మం­లో తు­ఫా­న్ ప్ర­భా­వం­తో భారీ వర్షా­లు వాన ము­సు­రు కు­రు­స్తుం­డ­టం­తో పం­డిన పంట సైతం చే­తి­కి వచ్చే అవ­కా­శం లే­కుం­డా పో­యిం­ది.

ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ ప్రాంతంలో పంట నష్టం ఎక్కువగా ఉంది. కాపుకొచ్చిన సజ్జ పంట 1,771 హెక్టార్లలో దెబ్బతింది. జొన్న 60 హెక్టార్లు, మొక్కజొన్న 268 హెక్టార్లు, పత్తి 6,577 హెక్టార్లు, వరి 1,440 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగులుప్పలపాడు, జరుగుమల్లి, కొండపి ప్రాంతాల్లో పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి.



Tags

Next Story