NADDA: అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోశాం

NADDA: అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోశాం
X
సారథ్యం సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ చీఫ్.. మోదీ, చంద్రబాబు పాలనలో అభివృద్ధి : నడ్డా.. వారసత్వ రాజకీయాలకు చెల్లు చీటి రాశాం

ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ, ఏపీ సీఎం చం­ద్ర­బా­బు పా­ల­న­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­గ­తి పథం­లో నడు­స్తోం­ద­ని బీ­జే­పీ జా­తీయ అధ్య­క్షు­డు జేపీ నడ్డా అన్నా­రు. బీ­జే­పీ ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అధ్య­క్షు­డు పీ­వీ­ఎ­న్‌ మా­ధ­వ్‌ చే­ప­ట్టిన ‘సా­ర­థ్యం’ యా­త్ర ము­గిం­పు సభలో ఆయన మా­ట్లా­డా­రు. గత వై­సీ­పీ ప్ర­భు­త్వం.. అవి­నీ­తి, ప్ర­జా­స్వా­మ్య వ్య­తి­రేక వి­ధా­నా­లు అవ­లం­బిం­చిం­ద­ని వి­మ­ర్శిం­చా­రు. ఐదే­ళ్ల వై­సీ­పీ పా­ల­న­లో రా­ష్ట్రం అం­ధ­కా­రం­లో మగ్గిం­ద­ని వి­మ­ర్శిం­చా­రు. అయి­తే కూ­ట­మి ప్ర­భు­త్వం ఏర్ప­డిన 15 నె­ల­ల్లో­నే రా­ష్ట్రం­లో అభి­వృ­ద్ధి సా­ధ్య­మ­ని ని­రూ­పిం­చా­మ­న్నా­రు. ప్ర­జల అం­కి­త­భా­వం వల్లే ఈ మా­ర్పు సా­ధ్య­మైం­ద­ని చె­ప్పా­రు. ‘‘ప్ర­స్తు­తం సబ్ కా సా­థ్‌, సబ్ కా వి­కా­స్, సబ్ కా వి­శ్వా­స్’ ని­నా­దం­తో ముం­దు­కు వె­ళ్తు­న్నాం. అయో­ధ్య­లో రామ మం­ది­రం ని­ర్మిం­చాం. ట్రి­పు­ల్ తలా­క్‌­ను రద్దు చే­శాం. ప్ర­జల జీవన ప్ర­మా­ణా­లు పెం­చ­డం కోసం జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో ప్ర­జ­ల­కు ముం­దు­గా­నే దసరా, దీ­పా­వ­ళి తీ­సు­కొ­చ్చాం. " అని వి­వ­రిం­చా­రు.



వైసీపీపై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు

“ 2014కు ముం­దు దే­శం­లో అస­మ­ర్థ, వా­ర­స­త్వ రా­జ­కీ­యా­లు నడి­చే­వి. అప్ప­ట్లో దే­శం­లో అవి­నీ­తి రా­జ్య­మే­లిం­ది. 2014కు ముం­దు ప్ర­జ­ల­ను మభ్య పె­ట్టేం­దు­కు మే­ని­ఫె­స్టో తీ­సు­కొ­చ్చి ఎన్ని­క­ల­య్యాక మరి­చి­పో­యే­వా­రు. వై­సీ­పీ పా­ల­న­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అం­ధ­కా­రం­లో­కి వె­ళ్లి­పో­యిం­ది. ఆ పా­ర్టీ అవి­నీ­తి పా­ల­న­కు చం­ద్ర­బా­బు, మోదీ చర­మ­గీ­తం పా­డా­రు. ఇప్పు­డు మోదీ పా­ల­న­లో దేశం అభి­వృ­ద్ధి పథం­లో నడు­స్తోం­ది. ఇదే స్ఫూ­ర్తి­తో ముం­దు­కు వె­ళ్లా­లి. ఆం­ధ్ర ప్ర­జల గుం­డె­ల్లో మోదీ ఉన్నా­రు. ఆయన గుం­డె­ల్లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ఉంది. సై­ద్ధాం­తిక పు­నా­దు­ల­పై ని­ర్మా­ణ­మైన పా­ర్టీ బీ­జే­పీ’ అని జేపీ నడ్డా అన్నా­రు. వి­శాఖ, కా­కి­నాడ, తి­రు­ప­తి స్మా­ర్ట్‌ సి­టీ­లు­గా ని­లు­స్తు­న్నా­య­ని.. సా­గ­ర్‌­మాల పే­రు­తో 14 పో­ర్టు­లు ని­ర్మి­స్తు­న్నా­ని నడ్డా వె­ల్ల­డిం­చా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అభి­వృ­ద్ధి­కి కేం­ద్ర ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని స్ప­ష్టం చే­సిన నడ్డా, రా­ష్ట్రా­ని­కి కే­టా­యిం­చిన పలు కీలక ప్రా­జె­క్టు­ల­ను ప్ర­స్తా­విం­చా­రు. సా­గ­ర్ మాల పథకం కింద 14 పో­ర్టుల ని­ర్మా­ణం, వి­శా­ఖ­ప­ట్నం, కా­కి­నాడ, తి­రు­ప­తి­ల­ను స్మా­ర్ట్ సి­టీ­లు­గా అభి­వృ­ద్ధి చే­య­డం, జా­తీయ రహ­దా­రుల వి­స్త­రణ వంటి మౌ­లిక సదు­పా­యాల కల్ప­న­కు కేం­ద్రం పె­ద్ద­పీట వే­స్తోం­ద­న్నా­రు. వి­ద్య, ఆరో­గ్య రం­గా­ల్లో 10 కేం­ద్ర వి­ద్యా­సం­స్థ­లు, 6 కొ­త్త వై­ద్య కళా­శా­ల­ల­ను ఏర్పా­టు చే­సి­న­ట్లు తె­లి­పా­రు.

Tags

Next Story