Nadendla Manohar : చేతగాని దద్దమ్మలు రాజధానిని ఏం కడతారు

Nadendla Manohar : చేతగాని దద్దమ్మలు రాజధానిని ఏం కడతారు
రాజధాని అంశంపై గందరగోళం సృష్టిస్తూ యువతకు భవిష్యత్‌ లేకుండా చేస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు

విశాఖను రాజధానిగా ఒక్క శాతం ప్రజలు కూడా కోరుకోవడం లేదన్నారు జనసేన పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌. రాజధాని అంశంపై గందరగోళం సృష్టిస్తు యువతకు భవిష్యత్‌ లేకుండా చేస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ రాజధాని అనే అంశంతోనే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తుంటే పెట్టుబడులకు ఎవరు ముందుకోస్తారంటూ మండిపడ్డారు. పాలన చేతగాని దద్దమ్మలు రాజధాని ఏం కడతారంటూ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story