Nadendla Manohar : ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే : నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే : నాదెండ్ల మనోహర్
X
Nadendla Manohar : రాజు మారినప్పుడల్లా అభివృద్ధి జరగాలి కానీ నష్టం జరగకూడదన్నారు

Nadendla Manohar : ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని అన్నారు జనసేన ఆగ్రనేత నాదెండ్ల మనోహర్‌. రాజు మారితే రాజధానులు మారతయా? అని ప్రశ్నించారు. రాజు మారినప్పుడల్లా అభివృద్ధి జరగాలి కానీ నష్టం జరగకూడదన్నారు. అమరావతి రైతుల తరపున అందరికన్నా.. ముందు ప్రశ్నించి పోరాడిన వ్యక్తి పవన్‌కళ్యాణేనని అన్నారు. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు రైతులకు పవన్ అండగా నిలిచారని తెలిపారు. రైతుల ముందు ప్రభుత్వాలు మెట్టు దిగి ఉండాలే తప్ప రైతులను మెట్లు దించకూడదన్నారు. జగన్‌ సర్కార్‌ వచ్చాక రైతులు ఎక్కడా సంతోషంగా లేరని, ఒక రాజధాని కట్టలేరు కాని మూడు రాజధానులు జగన్‌ కడతారా? అని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

Tags

Next Story