NAGABABU: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌

NAGABABU: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌
X
నారా లోకేశ్ వెంటరాగా నామినేషన్‌ దాఖలు

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్‌ అధికారిణి వనితారాణికి నాగబాబు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తొలి నుంచి అండగా నిలవడంతో పాటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పొత్తుల కారణంగా పవన్ సూచన మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. ఏపీలో కూటమి అభ్యర్ధుల కోసం కూడా నాగబాబు ప్రచారం చేశారు.


మంత్రిగానూ..

ఎవ్వరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ, మంత్రిగా నాగబాబుకు అవకాశం దక్కినట్లుగా అధికార వర్గాల నుంచే సంకేతాలు వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కేటగిరీలో నాగబాబుకు అవకాశం కల్పిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. దాంతో పాటే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌‌లు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే నాగబాబు అభ్యర్ధిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. నాగబాబుతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా అభ్యర్ధులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అనంతరం కూటమి తరపున నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

కష్టపడ్డందుకే..

నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని వైసీపీ విమర్శించగా... జనసేన నేతలు ధీటుగా స్పందించారు. దీనిపై జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. జనసేన పార్టీ కోసం కష్టపడ్డందుకే నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘పవన్ కళ్యాణ్ పిల్లలకు ఇస్తే వారసత్వమంటారు.. కానీ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి పదవులు దక్కితే వారసత్వమేలా?’ అవుతుందని ఆయన ప్రశ్నించారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో జనసేనలో అన్ని సామాజిక వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం దక్కిందన్నారు.

Tags

Next Story