NAGABABU: నాగబాబుకు అమాత్య యోగం పట్టేదెప్పుడు..?

మెగా బ్రదర్..జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అమాత్య యోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు..అంతా అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే నాగబాబు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉండాల్సింది. అయితే ఉన్న ఒకే ఒక బెర్త్ కోసం మార్పులు చేయడం ఎందుకని..క్యాబినెట్ మార్పులు, చేర్పులు ఉంటాయని..అప్పుడు నాగబాబును తీసుకుంటారని ఎప్పటికప్పుడు కొత్త కొత్త న్యూస్ బయటికొస్తోంది. దాంతో నాగబాబుకు అమాత్య యోగం దక్కడం ఆలస్యమవుతోంది.
ఇప్పట్లో కష్టమే
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పట్లో మంత్రి కాలేరని తెలుస్తోంది. ముందుగా ఆయన్ని రాజ్యసభకు పంపుదామని అనుకున్నారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు. నాగబాబును కేబినెట్లోకి తీసుకునే విషయంలో కొన్ని కారణాలు అడ్డు వచ్చాయి. ఈ అంశం తన దగ్గరే పెండింగ్‌లో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే పెండింగ్‌లో ఉందన్నారు. జనసేన ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే చర్చ బాగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటే… అదే సామాజికవర్గం అన్న ముద్ర పడుతుంది. ఇది జనంలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుందేమోనని తటపటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కారణంతోనే నాగబాబును కేబినెట్లోకి తీసుకోవడం డౌట్‌గా మారింది.
కేవలం పార్టీకే పరిమితమా..?
నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంలో డైలమాలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. నాగబాబు సేవలను పూర్తిగా పార్టీకి వాడుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. నాగబాబును పార్టీలో యాక్టివ్‌గా ఉంచడంతోపాటు, ఆయనతో జిల్లా పర్యటనలు చేయించాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. మంత్రి పదవి ఇస్తే రెండిటికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుందనే ఉద్దేశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీగా ఉన్నారు. అందుకే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఒపీనియన్ మార్చుకుంటే కనుక నాగబాబు కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
కేంద్రమంత్రివర్గంలోకి...
త్వరలో సెంట్రల్ క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్ చేస్తారని అంటున్నారు. విస్తరణలో ఏపీకి ఇంకో రెండు బెర్తులు దక్కే అవకాశం ఉందట. అందులో ఒకటి జనసేనకు ఫిక్స్ చేయగా..నాగబాబు ఆ కోటాలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో బెర్త్ టీడీపీకి ఇస్తారని చెబుతున్నారు. రాయలసీమకు చెందిన టీడీపీ ఎంపీలైనా ఓ ఎస్సీ, మరో బీసీ నేతల్లో ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ పక్కా అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com